ఇందిరమ్మ ఇళ్ల కోసమే అధికంగా దరఖాస్తులు : మంత్రి శ్రీహరి
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:29 AM
ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమంలో వందకు పైగా వినతులు వస్తే అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే అధిక దరఖాస్తులు వచ్చాయని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమంలో వందకు పైగా వినతులు వస్తే అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే అధిక దరఖాస్తులు వచ్చాయని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. గాంధీభవన్‌లో గురువారం ఈ కార్యక్రమంలో బాధితుల నుంచి సమస్యలపై వినతులు, దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి వినతిపై సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన బీఆర్‌ఎస్ అబద్దాలను ప్రచారం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, ప్రజలతో ముఖాముఖీ కమిటీ ఇంఛార్జి జగదీశ్వర్‌రావు పాల్గొన్నారు.