Marriage Grant for Disabled Couple: దివ్యాంగుల వివాహ కానుక డబుల్
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:29 AM
దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులైన జంట వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహక నగదును రూ.లక్ష...
రూ.లక్ష నుంచి 2 లక్షలకు పెంపు
సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, జనవరి 17(ఆంద్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులైన జంట వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహక నగదును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2018లో పెంచిన ఈ మొత్తాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డబ్బును నేరుగా లబ్ధిదారురాలైన భార్య పేరున జమ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ వివాహానంతరం దివ్యాంగ జంటలు వైద్య ఖర్చులు, నివాసం, జీవనోపాధి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని పెంచామని చెప్పారు. పింఛన్ల పెంపుతో పాటు సంక్షేమ పథకాల్లో సాయం పెంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల పక్షపాతి అని రుజువైందని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.