పెరిగిన ఆటో గ్యాస్ సరఫరా
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:42 AM
మూతపడిన ఎల్పీజీ బంకులను మళ్లీ తెరిపించడంతోపాటు గ్యాస్ సరఫరాను పెంచేందుకు కృషి చేసిన సూపర్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ ఫ్యూయల్ కంపెనీల...
ఎల్పీజీ సరఫరా కంపెనీలకు స్టీఫెన్ రవీంద్ర అభినందన
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మూతపడిన ఎల్పీజీ బంకులను మళ్లీ తెరిపించడంతోపాటు గ్యాస్ సరఫరాను పెంచేందుకు కృషి చేసిన సూపర్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ ఫ్యూయల్ కంపెనీలను పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లయిస్ భవన్‌లో ఆటో ఎల్పీజీ సరఫరా చేసే ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1నాటి సమీక్షలో గుర్తించిన సమస్యలు ఎంతమేరకు పరిష్కారమయ్యాయనే దానిపై కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. ఈ వారంలో మొత్తం 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని సరఫరా చేయడంతోపాటు మూతపడిన 17 బంకులను మళ్లీ తెరిపించామని సరఫరాదారులు తెలిపారు. అయితే కొన్ని కంపెనీల పనితీరు ఆశించిన స్థాయిలోలేదని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటో ఎల్పీజీని ఎక్కువగా తెప్పించి బంకులన్నింటిలో నిత్యం గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు.