Share News

అర్చకులు సంతోషంగా ఉంటేనే భక్తులకు మేలు

ABN , Publish Date - Jun 13 , 2026 | 07:11 AM

అర్చకులు సంతోషంగా ఉంటేనే భక్తులు చేసే పూజలు ఫలించి మేలు జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

అర్చకులు సంతోషంగా ఉంటేనే భక్తులకు మేలు

  • త్వరలో వెబ్‌సైట్‌, యాప్‌తో పథకాల అమలు: సురేఖ

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): అర్చకులు సంతోషంగా ఉంటేనే భక్తులు చేసే పూజలు ఫలించి మేలు జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అర్చక, ఉద్యోగులకు ‘అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి ట్రస్ట్‌’ నుంచి అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఇప్పటి వరకు అందిస్తున్న ఆర్థిక ప్రయోజనాల మొత్తం పెంచినట్లు మంత్రి తెలిపారు. పెంచిన మొత్తం 1 ఏప్రిల్‌ 2026 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్‌’ ప్రయోజనాల పెంపు జీవోను అర్చక, ఉద్యోగులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పథకాల ప్రయోజనాల అమలుకు త్వరలో వెబ్‌సైట్‌తోపాటు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తద్వారా అర్చక, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు సులభంగా అందుతాయన్నారు. కాగా ‘అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్‌’ నుంచి పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పెంచడం పట్ల తెలంగాణ అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ గుంగు ఉపేద్రశర్మ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 13 , 2026 | 07:11 AM