ఇంటర్‌లో వనజీవి రామయ్యపై పాఠ్యాంశం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:33 AM
పర్యావరణ ప్రేమికుడిగా.. కోటి మొక్కల రామయ్యగా.. వన జీవిగా గుర్తింపు పొందిన దివంగత దరిపల్లి రామయ్య జీవిత చరిత్రను తెలంగాణ...
ఫస్టియర్ బోటనీలో చేర్చిన విద్యా శాఖ
ఖమ్మం ఖానాపురం హవేలీ, జూన్ 27(ఆంద్రజ్యోతి): పర్యావరణ ప్రేమికుడిగా.. కోటి మొక్కల రామయ్యగా.. వన జీవిగా గుర్తింపు పొందిన దివంగత దరిపల్లి రామయ్య జీవిత చరిత్రను తెలంగాణ విద్యాశాఖ ఇంటర్‌లో పాఠ్యాంశంగా చేర్చింది. ప్రకృతి పరిరక్షణకు ఆయన చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేయడం, ఆయన స్ఫూర్తితో యువతను ఆ యజ్ఞంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం బోటనీ (వృక్ష శాస్త్రం)లో ఈ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. వనజీవి రామయ్యది ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. భారత ప్రభుత్వం 2017లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన 2025 ఏప్రిల్ 12న కన్నుమూశారు.