Share News

డ్రైవింగ్‌ లైసెన్సుకి ఇకపై 3 పరీక్షలు!

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:47 AM

రాష్ట్రంలో డ్రైవిం గ్‌ లైసెన్సు పొందడం ఇకపై కఠినతరం కానుంది. ఇకనుంచి లైసెన్స్‌ జారీలో 3 దశల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

డ్రైవింగ్‌ లైసెన్సుకి ఇకపై 3 పరీక్షలు!

హైదరాబాద్‌, మార్చి22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రైవిం గ్‌ లైసెన్సు పొందడం ఇకపై కఠినతరం కానుంది. ఇకనుంచి లైసెన్స్‌ జారీలో 3 దశల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం దరఖాస్తుదారులకు ఎల్‌ఎల్‌ఆర్‌, శాశ్వత డ్రైవింగ్‌ పరీక్ష నిర్వహిస్తూ డ్రైవింగ్‌ లైసెన్సులు ఇస్తున్నారు. వీటికి అదనంగా ఇకపై ఆన్‌లైన్‌లో రోడ్డు భద్రతా అవగాహన పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో 3గంటల నిడివిగల పరీక్షలో 6పార్టులుంటాయి. ఒక్కోటి 30నిమిషాలు ఉంటుంది. ఈ పరీక్ష రాసిన వారికి ఓ సర్టిఫికెట్‌ నంబర్‌ కేటాయిస్తారు. దాని ఆధారంగానే లెర్నర్‌ లైసెన్సు టెస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Mar 23 , 2026 | 07:02 AM