Share News

దానకిశోర్‌కు పంచాయతీరాజ్‌ శాఖ

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:42 AM

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్‌కుమార్‌ను...

దానకిశోర్‌కు పంచాయతీరాజ్‌ శాఖ

  • రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఏడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్‌కుమార్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించింది. ప్రస్తుతం కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.దానకిశోర్‌ను పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఏడు జిల్లాలకు కొత్త కలెక్టర్లు రాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఆరుగురు ఐఏఎ్‌సలను జోనల్‌ కమిషనర్లుగా నియమించారు. ఈ మేరకు సీఎస్‌ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Apr 26 , 2026 | 04:42 AM