Share News

అచ్చంపేట ఎత్తిపోతలపై ఎన్జీటీ ఆదేశాల తాత్కాలిక నిలుపుదల

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:52 AM

నల్లమల ప్రాంతంలో ‘అచ్చంపేట ఎత్తిపోతల’ పథకాన్ని అనుమతులన్నీ వచ్చే వరకు చేపట్టరాదంటూ జాతీయ హరిత .....

అచ్చంపేట ఎత్తిపోతలపై ఎన్జీటీ ఆదేశాల తాత్కాలిక నిలుపుదల

  • స్టే ఇచ్చిన హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): నల్లమల ప్రాంతంలో ‘అచ్చంపేట ఎత్తిపోతల’ పథకాన్ని అనుమతులన్నీ వచ్చే వరకు చేపట్టరాదంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) జారీ చేసిన ఆదేశాలను మంగళవారం హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, బీఐపీల్‌- కేఈపీపీఎల్‌- జేఎల్‌ జాయింట్‌ వెంచర్‌తో పాటు ప్రైవేట్‌ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన అనంత సీతారాంరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన అనిల్‌కుమార్‌లు ఎన్జీటీలో పిటిషన్‌ వేశారు. దీనిపై ట్రైబ్యునల్‌ గత నెల విచారణ జరిపింది. 300 మీటర్ల దూరంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఉన్న నేపథ్యంలో అనుమతులన్నీ వచ్చే వరకు పనులు ఆపాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇస్తూ, విచారణను వాయిదా వేసింది.

Updated Date - Mar 18 , 2026 | 04:52 AM