లోదుస్తుల్లో ఉన్న రిటైర్డ్ ఎస్సైని ఈడ్చుకెళ్లిన పోలీసులు...హైకోర్టు ఆగ్రహం
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:37 AM
దశాబ్దాలపాటు సేవలు అందించిన రిటైర్డ్ ఎస్సై మహమ్మద్ ఉస్మాన్ (75)ను పోలీసులు ఎలాంటి కారణాలు వివరించకుండా లోదుస్తులతో...
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలపాటు సేవలు అందించిన రిటైర్డ్ ఎస్సై మహమ్మద్ ఉస్మాన్ (75)ను పోలీసులు ఎలాంటి కారణాలు వివరించకుండా లోదుస్తులతో ఈడ్చుకెళ్లడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని మధురానగర్ పోలీసులతోపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. ఆ వృద్ధ విశ్రాంత పోలీసుకు పరిహారం ఎందుకు ఇవ్వకూడదో వివరణలో తెలియజేయాలని కూడా పేర్కొంది. మే నెల 18న యూస్‌ఫగూడలోని తన ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు తనకు బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈడ్చుకెళ్లారని తెలిపారు. స్పృహ తప్పి పడిపోవడంతో నడిరోడ్డుపై వదిలివెళ్లారని పేర్కొన్నారు. స్థానికులు గమనించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని వివరించారు. వాదనలు విన్న జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని పోలీసులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదావేసింది.