పదవీ విరమణ ప్రయోజనాలు ఎంతమందికి చెల్లించారు?: హైకోర్టు
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:03 AM
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు పదవీ విరమణ ప్రయోజనాల కోసం...
హైదరాబాద్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల వివరాలు, వారికి ఆర్థిక శాఖ జారీ చేసిన టోకెన్ నంబర్ల సమాచారాన్ని 2వారాల్లో తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 2వారాలకు వాయిదా వేసింది. పదవీ విరమణ చెల్లింపులకు సంబంధించి హైకోర్టులో పలు ధిక్కరణ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల, ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారు? ఇంకా ఎంత మందికి ఇవ్వాలని వివరాలు అడిగారు. ఏప్రిల్ 9లోగా అందరికీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇంకా ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. టోకెన్లతో సహా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.