Share News

ఎమ్మెల్సీలకు ప్రజాప్రతినిధుల కోర్టు వర్తించదు

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:39 AM

తనపై వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన దాదాపు 120 క్రిమినల్‌ కేసులను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయడంతోపాటు ఒకే అంశంపై నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లను....

ఎమ్మెల్సీలకు ప్రజాప్రతినిధుల కోర్టు వర్తించదు

  • తీన్మార్‌ మల్లన్న పిటిషన్‌పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తనపై వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన దాదాపు 120 క్రిమినల్‌ కేసులను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయడంతోపాటు ఒకే అంశంపై నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌. తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. హోంశాఖ న్యాయవాది మహేశ్‌రాజే వాదిస్తూ.. ప్రజాప్రతినిధుల కేసులను వేగంగా విచారించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ జీవో 6 జారీ అయిందని పేర్కొన్నారు. ఆ జీవోలో ఎంపీ, ఎమ్మెల్యేలు అని ఉందే తప్ప ఎమ్మెల్సీ అనే పదం లేదని గుర్తుచేశారు. ఆ జీవోను మార్చే శక్తి హైకోర్టుకు లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల పర్యవేక్షణ కోసం నమోదైన సుమోటో పిటిషన్‌కు జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Mar 11 , 2026 | 04:39 AM