మిల్లర్ల పిటిషన్‌లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:34 AM
మిల్లింగ్ కోసం సరఫరా చేసిన వరి ధాన్యాన్ని దారి మళ్లించారని, తద్వారా రూ.3960 కోట్ల మేర బకాయిలు ఉన్నారంటూ తమపై ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ....
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మిల్లింగ్ కోసం సరఫరా చేసిన వరి ధాన్యాన్ని దారి మళ్లించారని, తద్వారా రూ.3960 కోట్ల మేర బకాయిలు ఉన్నారంటూ తమపై ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ మిల్లర్లు చేసిన వినతిపై హైకోర్టు తీర్పు వాయిదా వేసింది. తమపై పౌరసరఫరాల కార్పొరేషన్ నమోదు చేసిన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ దాదాపు 360 మంది రైస్‌మిల్లు యజమానులు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ జె.శ్రీనివాసరావు గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్.ఎన్.హేమేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వం తరఫునపబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.