Share News

జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:20 AM

హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్‌లో క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ తెలంగాణ జనసేన పార్టీ దా ఖలు చేసిన ...

జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

పిటిషన్‌ను హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్‌లో క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహణకు అనుమతి కోరుతూ తెలంగాణ జనసేన పార్టీ దా ఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ర్టీ తిరస్కరించింది. ఈ అంశాన్ని హౌస్‌మోషన్‌ రూపంలో విచారించాల్సినంత అత్యవసరం లేదని.. వెకేషన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం సమావే శం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని.. జనసేన తొలుత హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందన్న కారణంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది.

Updated Date - Jun 03 , 2026 | 05:20 AM