Share News

బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరణ

ABN , Publish Date - May 21 , 2026 | 03:34 AM

కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనున్నారు.

బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరణ

  • హైకోర్టు రిజిస్ట్రీకి భగీరథ్‌ న్యాయవాదుల లేఖ

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోనున్నారు. పోక్సో కేసులో బండి భగీరథ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు కాలం చెల్లిపోయింది. దీంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని భగీరథ్‌ న్యాయవాదులు హైకోర్టు రిజిస్ర్టీకి లేఖ సమర్పించారు. ఈ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ గురువారం నాటి ఉపసంహరణ కేసుల జాబితాలో లిస్ట్‌ అయింది. గతవారం బండి భగీరథ్‌ను పోలీసుల అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించేందుకు జస్టిస్‌ టీ మాధవి దేవి ధర్మాసనం నిరాకరించిన విషయం తెలిసిందే.

Updated Date - May 21 , 2026 | 03:34 AM