డీపీసీ సిఫార్సుల ప్రకారం పదోన్నతులు ఇవ్వొచ్చు: హైకోర్టు
ABN , Publish Date - May 08 , 2026 | 06:44 AM
డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సిఫార్సుల ప్రకారం దేవాదాయ శాఖలో పదోన్నతులు ఇవ్వొచ్చని హైకోర్టు పేర్కొంది.
డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సిఫార్సుల ప్రకారం దేవాదాయ శాఖలో పదోన్నతులు ఇవ్వొచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ పదోన్నతులు తాము ఇవ్వబోయే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 26 ప్రకారం తాను దాఖలు చేసిన అప్పీల్‌ను పరిష్కరించకుండానే దేవాదాయ శాఖ కమిషనర్ సీనియార్టీ జాబితాను ప్రకటించడం చెల్లదంటూ సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ గణేశ్ ఆలయం ఈవో ఎం.రామకృష్ణారావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని ప్రతివాదులైన రెవెన్యూ (దేవాదాయ) ముఖ్య కార్యదర్శి, దేవాదాయ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.