Share News

దుస్తులు, బెడ్‌షీట్‌లు తదితరాలు టెస్కో ద్వారానే సేకరించాలి

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:23 AM

గురుకుల విద్యాసంస్థలతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలు దుస్తులు, కార్పెట్లు, బెడ్‌షీట్‌లు, బ్లాంకెట్‌లు, టవళ్లు తదితరాలను తెలంగాణ స్టేట్‌ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌...

దుస్తులు, బెడ్‌షీట్‌లు తదితరాలు టెస్కో ద్వారానే సేకరించాలి

  • గురుకులాలు, అన్ని ప్రభుత్వ సంస్థలకు హైకోర్టు ఆదేశం

గురుకుల విద్యాసంస్థలతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలు దుస్తులు, కార్పెట్లు, బెడ్‌షీట్‌లు, బ్లాంకెట్‌లు, టవళ్లు తదితరాలను తెలంగాణ స్టేట్‌ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌(టెస్కో) ద్వారానే సేకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సరఫరా చేయలేమంటూ టెస్కో ధ్రువీకరణ పత్రం జారీ చేశాకే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేకరించవచ్చని పేర్కొంది. అటువంటి ధ్రువీకరణ పత్రం లేకుండా గురుకుల పాఠశాలలకు కార్పెట్లు, బ్లాంకెట్లు, టవళ్లు, దుస్తుల సరఫరా నిమిత్తం ఈ నెల 2న ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ ఇచ్చిన ఇ-టెండరు నోటిఫికేషన్‌ చెల్లదని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా వస్త్ర సరఫరా నిమిత్తం టెస్కోకు గతంలో ఇచ్చిన ఆర్డర్‌ రద్దు కూడా చెల్లదని పేర్కొంది. గురుకుల పాఠశాలలకు దుస్తుల సరఫరా నిమిత్తం ఈ నెల 2న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వరంగల్‌ జిల్లా కొత్వాడకు చెందిన వీరాంజనేయ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ సేల్స్‌ సొసైటీ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Updated Date - Apr 22 , 2026 | 05:23 AM