Share News

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దు: హైకోర్టు

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:52 AM

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు ఆదేశించింది.

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో   పార్కింగ్‌ ఫీజు వసూలు చేయొద్దు: హైకోర్టు
tg high court

  • హైదరాబాద్‌లో నాంపల్లి నుంచి

  • పంజాగుట్ట వరకు పార్కింగ్‌ సౌకర్యం లేదని వ్యాఖ్య

హైదరాబాద్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అధిక పార్కింగ్‌ ఫీజులు వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. నవీన్‌రాజు, వజీద్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం.. పార్కింగ్‌ సౌకర్యాలు లేకపోయినా ఫీజు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో సైతం ఎక్కడా పార్కింగ్‌ సౌకర్యాలు లేవని, నాంపల్లి నుంచి పంజాగుట్ట వరకు ఎక్కడా పార్కింగ్‌ అందుబాటులో లేదని వ్యాఖ్యానించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉస్మానియా, నిమ్స్‌ ఆసుపత్రుల్లో పార్కింగ్‌ చేసి బయట పనులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంది. అధిక పార్కింగ్‌ ఫీజులపై వివరణ ఇవ్వాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Oct 09 , 2026 | 03:52 AM