Share News

వలస వచ్చారని సీటు తిరస్కరించరాదు

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:53 AM

ఎస్టీ (లంబాడా) సర్టిఫికెట్‌ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కోటా వర్తించదనే కారణంతో మెడికల్‌ సీటు నిరాకరించడం సబబు కాదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్‌ ఎస్టీ విభాగానికి చెందినవారని.. తెలంగాణ స్థానికురాలని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెను మెడికల్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని ఆదేశించింది

వలస వచ్చారని సీటు తిరస్కరించరాదు
HIGHCOURT

  • ఎస్టీ విద్యార్థినికి స్థానిక కోటాలో

  • మెడికల్‌ సీటివ్వాలని హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎస్టీ (లంబాడా) సర్టిఫికెట్‌ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కోటా వర్తించదనే కారణంతో మెడికల్‌ సీటు నిరాకరించడం సబబు కాదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్‌ ఎస్టీ విభాగానికి చెందినవారని.. తెలంగాణ స్థానికురాలని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆమెను మెడికల్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని ఆదేశించింది. అయితే పిటిషనర్‌ స్థానికత ఏంటనేది తాము ఇవ్వబోయే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. వికారాబాద్‌ న్యూగంజ్‌కు చెందిన చవాన్‌ ఆర్తి అనే విద్యార్థిని పిటిషన్‌పై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ పిటిషనర్‌ నీట్‌ అర్హత పరీక్షకు ముందు వరసగా నాలుగేళ్లు తెలంగాణలోనే చదివారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ దశలో పిటిషనర్‌కు స్థానిక కోటా తిరస్కరించడం చెల్లదని, కౌన్సెలింగ్‌కు అనుమతించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

Updated Date - Sep 16 , 2026 | 06:59 AM