ట్రయల్ కోర్టు ఎన్‌వోసీ ఇస్తే మంత్రి అడ్లూరికి పాస్‌పోర్ట్ ఇవ్వండి :హైకోర్టు
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:00 AM
ట్రయల్ కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తెచ్చుకుంటే దాని ఆధారంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పాస్‌పోర్ట్ జారీచేయాలని పాస్‌పోర్ట్ అథారిటీకి హైకోర్టు ఆదేశాలు ...
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ట్రయల్ కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తెచ్చుకుంటే దాని ఆధారంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పాస్‌పోర్ట్ జారీచేయాలని పాస్‌పోర్ట్ అథారిటీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వివిధ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నందున పాస్‌పోర్ట్ అథారిటీ ఆయనకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై మంత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ ప్రజాప్రతినిధి కాబట్టి సంబంధిత కోర్టులో ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకోవాలని, దీనిపై సంబంధిత ట్రయల్ కోర్టు ఒక వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఎన్‌వోసీ కేవలం పాస్‌పోర్ట్ జారీకి మాత్రమే ఉపయోగపడుతుందని, విదేశాలకు వెళ్లాలంటే మాత్రం మళ్లీ ట్రయల్ కోర్టు అనుమతి పొందాల్సిందే అని స్పష్టం చేసింది.