Share News

కౌంటర్‌ దాఖలుకు చివరి అవకాశం

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:38 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచి కాంగ్రె్‌సలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కౌంటర్‌ దాఖలు చేయడానికి చివరి అవకాశం...

కౌంటర్‌ దాఖలుకు చివరి అవకాశం

  • పార్టీ ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యేలపై హైకోర్టు అసహనం

  • రెండు వారాల్లోపు దాఖలు చేయాలని ఆదేశం

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచి కాంగ్రె్‌సలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కౌంటర్‌ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. పలుమార్లు అవకాశం ఇచ్చినా ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కౌంటర్‌లు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. చివరి అవకాశంగా మరో రెండువారాలు గడువు ఇస్తున్నామని చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఆ తర్వాత ప్రత్యుత్తరం ఇవ్వడానికి పిటిషనర్లు అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వారం సమయం కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మూడువారాల్లోనే ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు సైతం సమర్పించాలని పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన ఒరిజనల్‌ రికార్డులను సమర్పించాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. కాగా, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేలు గురువారం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు.

Updated Date - Jun 26 , 2026 | 04:38 AM