Share News

తెలంగాణ హైకోర్టులో..నలుగురు అదనపు జడ్జిలకు శాశ్వత హోదా

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:15 AM

తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు అదనపు జడ్జిలకు శాశ్వత జడ్జి హోదా కల్పిస్తూ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

తెలంగాణ హైకోర్టులో..నలుగురు అదనపు జడ్జిలకు శాశ్వత హోదా

  • కేరళలో జడ్జిలుగా ఇద్దరు మహిళా లాయర్లు

  • కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు అదనపు జడ్జిలకు శాశ్వత జడ్జి హోదా కల్పిస్తూ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జిలుగా పని చేస్తున్న జస్టిస్‌ యర్రా రేణుక, జస్టిస్‌ నందికొండ నర్సింగరావు, జస్టిస్‌ తిరుమలదేవి, జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌ రావుకు శాశ్వత జడ్జి హోదా కల్పించాలని సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 42 మంది జడ్జిలు ఉండాలి. ప్రస్తుతం 28 మందే ఉన్నారు. మరోవైపు ప్రీత అరవిందన్‌ కృష్ణమ్మ, లిజ్‌ మాథ్యూ అనే ఇద్దరు మహిళా న్యాయవాదులను కేరళ హైకోర్టు జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. అలాగే, రాజేశ్వరీ నారాయణ హెగ్డే, కేదంబడి గణేశ్‌ శాంతి, మహాదేవప్ప బృంగేశ్‌ అనే ముగ్గురు న్యాయాధికారులను కర్ణాటక హైకోర్టు జడ్జిలుగా నియమించాలని ప్రతిపాదించింది. దాంతోపాటు బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్‌ మంజుష అజయ్‌ దేశ్‌పాండేను శాశ్వత జడ్జిగా నియమించాలని సిఫారసు చేసింది.

Updated Date - Apr 15 , 2026 | 04:15 AM