Share News

గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:38 AM

తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌ మంగళవారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌ను కలిసిన హైకోర్టు సీజే

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్‌ కుమార్‌ సింగ్‌ మంగళవారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన హైకోర్టు భవన నిర్మాణం తదితర విషయాలను గవర్నర్‌కు హైకోర్టు న్యాయమూర్తి వివరించారు. అంతకు ముందు పలువురు ప్రముఖులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గంటా చక్రపాణి ఇతర అధికారులతోపాటు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విశ్వవిద్యాలయం అకడమిక్‌, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. అలాగే ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఎన్‌.నాగరాజు, తెలంగాణ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాసరెడ్డి, డీఎండీఈ డైరక్టర్‌ రేర్‌అడ్మిరల్‌ అశ్వినికుమార్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు రవికుమార్‌ తదితరులు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Apr 08 , 2026 | 05:38 AM