హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచండి
ABN , Publish Date - May 21 , 2026 | 03:50 AM
తెలంగాణ హైకోర్టులో పెండింగ్ కేసులు అసాధారణ రీతిలో పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచాలని కేంద్ర న్యాయశాఖ ...
కేంద్ర న్యాయశాఖ మంత్రికి తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం వినతి
న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టులో పెండింగ్ కేసులు అసాధారణ రీతిలో పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం (టీహెచ్‌సీఏఏ) కోరింది. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు. త్వరితగతిన కేసుల పరిష్కారం, సమర్థమైన న్యాయపాలన అందించడమే ధ్యేయంగా హైకోర్టులో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఆ సంఖ్యను మరింతగా పెంచాలని ప్రతినిధి బృందం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డి.ఎల్. పాండు, కార్యదర్శి పి. శ్రవణ్‌కుమార్ గౌడ్, సంయుక్త కార్యదర్శి పి. కృష్ణకీర్తన తదితరులు ఉన్నారు.