భానుడి భగభగలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:21 AM
రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లిలో అత్యధికంగా 45.9 ఉష్ణోగ్రత నమోదైంది.
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలో వడద్బెకు ముగ్గురు మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లిలో అత్యధికంగా 45.9 ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా మూడు రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 45.8 డిగ్రీలు నమోదైంది. మిగతా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. పలుచోట్ల 45 డిగ్రీలు కూడా దాటింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండ తీవ్రతకు రహదారులపై వాహనాల రద్దీ తగ్గింది. గ్రేటర్ పరిధిలో మరో రెండు రోజుల పాటు సాయంత్రం, రాత్రి సమయంలో ఈదురు గాలులతో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వడదెబ్బకు ముగ్గురు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ భూక్యా రవి(35), కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటకు చెందిన తిప్ప నర్సింలు (30), హైదరాబాద్ ఎర్రగడ్డలో ప్యారాలాల్ (45) అనే యాచకుడు వడదెబ్బకు గురై చనిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం చాకలిగుడిసెలు గ్రామంలో పసుపులేటి మణెమ్మ (50) అనే మహిళ పిడుగుపాటుకు గురై మృతిచెందింది.