Share News

ఫిబ్రవరిలోనే సెగలు పుట్టిస్తున్న ఎండలు

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:04 AM

రాష్ట్రంలో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడో వారానికే ఎండలు మండుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు.

ఫిబ్రవరిలోనే సెగలు పుట్టిస్తున్న ఎండలు

  • పలుచోట్ల 35 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడో వారానికే ఎండలు మండుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటేశాయని, గురువారం నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా నిజామాబా ద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉం టుందని, ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Feb 19 , 2026 | 05:04 AM