Share News

అనారోగ్యం ఉన్నట్లు తేలితే తక్షణమే చికిత్స

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:07 AM

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఉమెన్‌ వెల్‌నెస్‌ ప్రొఫైలింగ్‌ ప్రోగ్రామ్‌ అమలులో ...

అనారోగ్యం ఉన్నట్లు తేలితే తక్షణమే చికిత్స

  • మహిళల ఆరోగ్య ప్రొఫైలింగ్‌పై మంత్రి దామోదర సమీక్ష

హైదరాబాద్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఉమెన్‌ వెల్‌నెస్‌ ప్రొఫైలింగ్‌ ప్రోగ్రామ్‌ అమలులో అలసత్వం వహించవద్దని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమ పురోగతి, అమలు తీరుపై ఆయన సెక్రటేరియట్‌ నుంచి ఆరోగ్యశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. టెస్టుల కోసం గ్రామాల నుంచి మహిళలను ఆస్పత్రులకు తీసుకురావడానికి, పరీక్షల తర్వాత సురక్షితంగా ఇళ్ల వద్ద దింపడానికి వాహనాలను సమకూర్చాలని ఆయన అధికారులకు సూచించారు. స్ర్కీనింగ్‌లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే తక్షణమే చికిత్స ప్రారంభించాలన్నారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేేస అంశంపై సీఎంతో చర్చించి హెల్త్‌ పాలసీపై సానుకూల నిర్ణయం తీసుకుంటా మని దామోదర చెప్పారు. టిడబ్ల్యూజేఎఫ్‌బృందం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసింది. జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు

Updated Date - Mar 12 , 2026 | 05:07 AM