Share News

యూరియా యాప్‌పై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయండి

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:58 AM

యూరియా యాప్‌పై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యూరియా యాప్‌ను రద్దు ..

యూరియా యాప్‌పై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

నల్లగొండ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యూరియా యాప్‌పై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యూరియా యాప్‌ను రద్దు చేయాలని కోరుతూ రైతుబంధు సమితి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, మరో ముగ్గురు రైతులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌ సింగ్‌, న్యాయమూర్తి గౌస్‌మీరా మోహియుద్దీన్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులని, చాలా మంది వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉండవని, కొందరి వద్ద ఈ ఫోన్లు ఉన్నా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగించలేని పరిస్థితిలో ఉన్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. యూరియా కోసమే రైతులు పనులన్నీ ఆపుకుని పరుగులెత్తే పరిస్థితి తలెత్తిందని తన పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు పిటిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.

Updated Date - Apr 24 , 2026 | 03:58 AM