‘విద్వేష ప్రసంగాల బిల్లు’పై సెలక్ట్ కమిటీ
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:30 AM
విద్వేష ప్రసంగాలు, నేరాల (నిరోధక) బిల్లుపై చర్చించి నివేదిక ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభా కమిటీని ఏర్పాటుచేశారు.
చైౖర్మన్‌గా మంత్రి పొన్నం.. మరో 12 మంది సభ్యులు
ఏర్పాటుచేసిన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్
అసెంబ్లీ, మండలిలో పలు కమిటీల ఏర్పాటు
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): విద్వేష ప్రసంగాలు, నేరాల (నిరోధక) బిల్లుపై చర్చించి నివేదిక ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శాసనసభా కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్‌గా ఉంటారు. మరో 12 మంది సభ్యులను కూడా నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు బాలు నాయక్, తోట లక్ష్మీకాంతరావు, జీ మధుసూదన్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కూచుకుళ్ల రాజే్‌షరెడ్డి, మామిడాల యశస్విని, దానం నాగేందర్, కోవా లక్ష్మి, కే మాణిక్‌రావు, రామ్మోహన్ పవార్, అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాలా, కూనంనేని సాంబశివరావు ఉంటారు. ఈ బిల్లును గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగింది. అయితే, బిల్లుపై లోతుగా చర్చించి సిఫార్సులు చేసేందుకు సెలక్ట్ కమిటీని వేయాలని అప్పుడు నిర్ణయించారు. తాజాగా కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ నివేదిక అందించిన తర్వాత మళ్లీ శాసనసభలో బిల్లుపై చర్చించి ఆమోదిస్తారు.
అసెంబ్లీ, మండలిలో పలు కమిటీల ఏర్పాటు
శాసనసభ సంక్షేమం, ఇతర అంశాలకు సంబంధించి అసెంబ్లీ, మండలి సభ్యులతో కూడిన తొమ్మిది సంయుక్త కమిటీలతోపాటు శాసనసభకు చెందిన ఐదు, మండలికి చెందిన ఆరు కమిటీలను సభాపతి సోమవారం ఏర్పాటుచేశారు. సంయుక్త కమిటీల్లో కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్స్ చైర్మన్‌గా కడియం శ్రీహరి, సౌకర్యాల కమిటీ, వన్యప్రాణులు-పర్యావరణ పరిరక్షణ కమిటీల చైౖర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్, ఎస్సీ కులాల సంక్షేమ కమిటీ చైౖర్మన్‌గా మేడిపల్లి సత్యం, ఎస్టీ కులాల సంక్షేమ కమిటీ చైౖర్మన్‌గా పాయం వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ కమిటీ చైౖర్మన్‌గా మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, లైబ్రరీ కమిటీ చైౖర్‌పర్సన్‌గా మట్టా రాగ మయి.. మహిళ, శిశు, దివ్యాంగ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా చిట్టెం పర్ణికారెడ్డి, మైనార్టీల సంక్షేమ కమిటీ చైౖర్మన్‌గా లక్ష్మీకాంతరావులను నామినేట్ చేశారు. శాసనసభ కమిటీల్లో పిటిషన్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీ, రూల్స్ కమిటీల చైౖర్మన్‌గా సభాపతే ఉండనున్నారు. ప్రభుత్వ హామీలపై కమిటీకి చైౖర్మన్‌గా పటోళ్ల సంజీవరెడ్డి, ఎథిక్స్ కమిటీ చైౖర్మన్‌గా రేవూరి ప్రకా్‌షరెడ్డి నియమితులయ్యారు. శాసనమండలి కమిటీల్లో పిటిషన్స్ కమిటీ, రూల్స్ కమిటీ, ప్రివిలేజెస్ కమిటీలకు చైౖర్మన్‌గా మండలి చైౖర్మన్ ఉంటారు. ప్రభుత్వ హామీలపై కమిటీ చైౖర్మన్‌గా కేతావత్ శంకర్, సభ ముందు ఉంచిన పత్రాల కమిటీ చైర్మన్‌గా చల్లా వెంకట్రామ్‌రెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా మహే్‌షకుమార్ గౌడ్‌లను నామినేట్ చేశారు.