Share News

8వ తరగతి నుంచే నీట్‌, ఎంసెట్‌ శిక్షణ:పొన్నం

ABN , Publish Date - May 22 , 2026 | 04:22 AM

మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులను 8వ తరగతి నుంచే నీట్‌, ఎంసెట్‌, పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని అధ్యాపకులకు ...

8వ తరగతి నుంచే నీట్‌, ఎంసెట్‌ శిక్షణ:పొన్నం

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులను 8వ తరగతి నుంచే నీట్‌, ఎంసెట్‌, పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలని అధ్యాపకులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. ప్రతి పాఠశాలలో ర్యాంకర్ల ఫొటోలను ఏర్పాటు చేసి, ఫలితాలపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఎంజేపీ గురుకులాల పనితీరుపై అధికారులు, పాఠశాలల ప్రిన్సిపాళ్లతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరంలో ఎంజేపీ గురుకులాలు రాష్ట్రంలో అగ్రగామిగా నిలవాలని, ఆ దిశగా అధ్యాపక బృందం పనిచేయాలని సూచించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల యాజమాన్యాన్ని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

Updated Date - May 22 , 2026 | 04:22 AM