Share News

పదేళ్లలో తొలిసారి!

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:04 AM

గత పదేళ్ల పాలనకు భిన్నంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల, గురుకుల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, షూస్‌, సాక్స్‌, బ్యాగులు, బెడ్‌షీట్లు...

పదేళ్లలో తొలిసారి!

  • గురుకుల విద్యార్థులకిచ్చే కిట్‌లు సకాలంలో అందజేత

  • గతంలో జూలైలో ఇవ్వాల్సినవి ఫిబ్రవరిలో

  • ఇప్పుడు వస్తువులు, నాణ్యత పెంచి జూలైలోపే అందజేత

  • పదేళ్ల బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ పాలనపై సర్కారు నివేదిక

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్ల పాలనకు భిన్నంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల, గురుకుల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, షూస్‌, సాక్స్‌, బ్యాగులు, బెడ్‌షీట్లు, ట్రాక్‌ సూట్లు, నైట్‌ డ్రెస్సులు, స్టేషనరీ కిట్లు తదితర వస్తువులను సకాలంలో అందిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఇచ్చిన వస్తువులే కాకుండా మరికొన్ని వస్తువులను అదనంగా చేర్చి.. పూర్తి నాణ్యతతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేస్తున్నామని తెలిపింది. గత పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఏయే వస్తువులను ఏ సమయంలో అందించారనే దానిపై రేవంత్‌ ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసింది. దాని ప్రకారం.. విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమైతే.. విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, ఇతర వస్తువులను విద్యా సంవత్సరం చివర్లో అంటే.. జనవరి, ఫిబ్రవరిల్లో అందించిన ఘటనలు పదే పదే నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఒక విద్యా సంవత్సరానికి చెందిన వస్తువులు తర్వాతి విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేతికి చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. గతంలో ఇచ్చిన షూలు రెండు మూడు నెలల్లోనే చిరిగిపోయేవని నివేదికలో పేర్కొంది. గిరిజన హాస్టళ్లలో తొమ్మిదేళ్లపాటు బ్యాగు, షూలు ఇవ్వలేదని తెలిపింది. ఇప్పుడు వస్తువులను, నాణ్యతను పెంచి మరీ విద్యా సంవత్సరం ప్రారంభంలో జూలైలోనే ఇస్తున్నామని వివరించింది. కానీ, ఇప్పుడు బ్రాండెడ్‌ క్లాత్‌తో తయారు చేసిన వాటినే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27.5 లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. దాంతోపాటు విద్యార్థులకిచ్చే యూనిఫారాలను కూడా ప్రీమియం బ్రాండ్లు అయిన మఫత్‌లాల్‌ క్లాత్‌తో, టెస్కో (తెలంగాణ రాష్ట్ర హాండ్లూమ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ) తయారు చేసిన నాణ్యమైన దుస్తులను అందిస్తున్నామని వివరించింది. ఈవిధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రోత్సహించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని పేర్కొంది.

వాట్సాప్‌ ద్వారా ప్రోగ్రెస్‌ రిపోర్టులు

విద్యార్థుల ప్రోగ్రెస్‌ రిపోర్టులు, హాల్‌ టికెట్లు, మార్కుల మెమోలు, పరీక్షా ఫలితాలు వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. విద్యాశాఖ, మీేసవ సంయుక్తంగా రూపొందించిన ఈ ేసవలను ఎల్‌బీ ేస్టడియంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్‌ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ను డిజిటల్‌ మస్కట్‌గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్‌ వీడియోల ద్వారా విద్యార్థులకు విద్యా సమాచారం, అవగాహన సందేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు వాట్సా్‌పలో పంపించనున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 05:04 AM