Share News

గురుకుల విద్యార్థుల వసతుల కోసం కసరత్తు

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:50 AM

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సామగ్రి సమకూర్చేందుకు ...

గురుకుల విద్యార్థుల వసతుల కోసం కసరత్తు

  • 9 రకాల వస్తువుల సరఫరాకు ఈ-టెండర్ల ఆహ్వానం

  • టెండర్‌ దాఖలుకు ఈ నెల 13 వరకు గడువు

  • విద్యాసంవత్సరం ఆరంభం నాటికే సరఫరా చేసేలా చర్యలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సామగ్రి సమకూర్చేందుకు తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) శ్రీకారం చుట్టింది. 2026 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులకు అవసరమైన వివిధ రకాల వస్తువుల సరఫరా కోసం ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌(పీఎంయూ) ద్వారా ఈ-టెండర్లను ఆహ్వానించినట్లు సొసైటీ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 విభాగాల్లో ఈ-టెండర్‌ ప్రక్రియ సాగనుంది. ఇందులో ప్రధానంగా.. స్కూల్‌, వైట్‌ యూనిఫామ్‌ క్లాత్‌, స్కూల్‌ బ్యాగులు, షూలు, సాక్స్‌, టై, బెల్టులు, బెడ్డింగ్‌ మెటీరియల్స్‌(కార్పెట్లు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్లు, టవళ్లు), ఐడీ కార్డులు, స్టేషనరీ కిట్లు, పీటీ డ్రెస్‌, నైట్‌ డ్రెస్‌, ట్రాక్‌ సూట్లు, భోజనానికి అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, కటోరా, కప్పులు, స్పూన్లు, ట్రంక్‌ బాక్సులు, నోట్‌బుక్‌లు, ట్రాలీ బ్యాగుల సరఫరాకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లకు ఆసక్తి ఉన్న సరఫరాదారుల కోసం ఈ నెల 8న ఉదయం 11 గంటలకు డీఎ్‌సఎస్‌ భవనంలోని ఎస్సీ గురుకుల ప్రధాన కార్యాలయంలో ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు. బిడ్లను దాఖలు చేయడానికి ఈ నెల 13న సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్ణయించారు. అర్హత గల సంస్థలు టెండర్లలో పాల్గొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థులకు అన్ని వసతులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సొసైటీ సెక్రటరీ తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 04:50 AM