ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు స్వయంప్రతిపత్తి
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:53 AM
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్’కు పూర్తిస్థాయి ఆర్థిక అధికారాలను కల్పించింది.
ఆర్థికాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్’కు పూర్తిస్థాయి ఆర్థిక అధికారాలను కల్పించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025 డిసెంబరు 29నే హోంశాఖ ఈ కమిషనరేట్‌ను ఒక ప్రత్యేక విభాగంగా (హెచ్‌వోడీ)గా గుర్తించింది. తాజాగా ఆర్థిక అధికారాలను జోడించింది. ‘తెలంగాణ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్-2’ నిబంధనల ప్రకారం, నిధుల వినియోగంపై ఈ కమిషనరేట్‌కు ఇకపై స్వయంప్రతిపత్తి ఉంటుంది.