Share News

16 మంది అదనపు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ABN , Publish Date - May 23 , 2026 | 04:42 AM

తెలంగాణలో 16 మంది అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

16 మంది అదనపు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణలో 16 మంది అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వరంగల్‌ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) నిర్మల్‌కు, నిర్మల్‌ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వరంగల్‌కు బదిలీ అయ్యారు. సిద్దిపేట, నల్గొండ, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, మహబూబాబాద్‌, నిర్మల్‌, సూర్యాపేట్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాలకు కొత్తగా జిల్లా రెవెన్యూ అధికారులను (డీఆర్‌వో) నియమించారు. స్టేషన్‌ ఘనపూర్‌, ఉట్నూర్‌, హనుమకొండ డివిజన్లకు కొత్త ఆర్డీవోలను కేటాయించారు.

Updated Date - May 23 , 2026 | 04:42 AM