Share News

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:11 AM

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్‌ జారీ చేసింది.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 : కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్‌ జారీ చేసింది. వచ్చే నెల నుంచి దీన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్‌ నెల జీతం మే ఒకటో తేదీనే వారి ఖాతాల్లో వేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.80 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. ఆలస్యంగా అందే జీతాలతో వారు పడుతున్న ఇబ్బందులు దూరం కానున్నాయి.

Updated Date - Apr 08 , 2026 | 06:11 AM