Share News

ఈ నెల 23లోగా 30 శాతం బకాయిలు చెల్లిస్తాం

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:28 AM

మిషన్‌ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఎన్‌సీసీకి చెల్లించాల్సిన రూ.180.17 కోట్ల బకాయిల్లో...

ఈ నెల 23లోగా 30 శాతం బకాయిలు చెల్లిస్తాం

  • ఎన్‌సీసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ప్రభుత్వం హామీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): మిషన్‌ భగీరథ కింద తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి ఎన్‌సీసీకి చెల్లించాల్సిన రూ.180.17 కోట్ల బకాయిల్లో ఈనెల 23లోగా 30 శాతం బిల్లులను చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 నెలల్లో బిల్లులను చెల్లించాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఎన్‌సీసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్‌ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. గత ఆదేశాల అమల్లో భాగంగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆయన తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈనెల 23వరకు గడువు ఇేస్త 30 శాతం బిల్లులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి విచారణకు హాజరు మినహాయింపునివ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హాజరు మినహాయింపునకు అనుమతించారు.

Updated Date - Apr 17 , 2026 | 04:28 AM