ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిశీలనకు కమిటీ
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:04 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యల పరిశీలనకు ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యల పరిశీలనకు ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర రవాణా, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించింది. అలాగే, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను సభ్యులుగా, టీజీఎ్‌సఆర్టీసీ వైస్‌చైర్మన్, ఎండీని సభ్య కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, నాలుగు వారాల్లోగా తన నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది.