అర్చకులు, ఉద్యోగుల సమన్వయంతోనే పనులు విజయవంతమవుతాయి: కొండా సురేఖ
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:21 AM
అర్చకులు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతవుతాయని ...
అర్చకులు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతవుతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ(ఎ్‌సఐటీఏ)ను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత 12 ఏళ్లకు ఎస్‌ఐటీఏను పునఃప్రారంభించుకున్నామన్నారు. దేవాదాయ శాఖను సరికొత్తగా ఆవిష్కరించే దిశలో ఎస్‌ఐటీఏ కార్యాచరణ ఉండబోతుందన్నారు. ఆలయాల పరిపాలన, సిబ్బంది శిక్షణ, కొత్త సాంకేతికత అమలు దిశగా అవసరమైన విధానాలను, శిక్షణా కార్యక్రమాలను ఎస్‌ఐటీఏ చేపడుతుందని తెలిపారు. కాగా, 18 మంది ఉద్యోగులకు ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సర్వీస్’ కింద సీనియర్ అసిస్టెంట్లుగా, మరో 20 మంది ఉద్యోగులకు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఈవోలుగా దేవాదాయశాఖ పదోన్నతులు కల్పించగా.. వీరంతా మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పదోన్నతుల పత్రాలు అందుకున్నారు. ఇటు పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు కూడా మంత్రి చేతుల మీదుగా ‘అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధి’ ద్వారా అందే ఆర్థిక ప్రయోజనాల చెక్కులను అందుకున్నారు.