గురుకులాలు, హాస్టళ్లపై సర్కార్ ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - May 18 , 2026 | 03:29 AM
రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణను మరింత బలోపేతం చేయడంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు డైట్...
డైట్, కాస్మొటిక్ చార్జీల కోసం 221.24 కోట్ల విడుదల
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణను మరింత బలోపేతం చేయడంపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు డైట్(భోజన), కాస్మొటిక్ చార్జీలతో పాటు హాస్టల్ భవనాల అద్దెను సకాలంలో చెల్లించేందుకు వీలుగా ఇకపై ప్రతినెలా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకుగానూ ఆదివారం రూ.221.24కోట్ల నిధులు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖలతో పాటు విద్యాశాఖ పరిధిలో నడిచే సంస్థలకు ఈ నిధులు వినియోగించనుంది. నిధుల విడుదలలో దాదాపు తొమ్మిది నెలల నుంచి నెలకొన్న జాప్యాన్ని అధిగమించేలా.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదట మూడు నెలలకోసారి చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టి, ప్రస్తుతం దాన్ని నెలవారీ చెల్లింపుల ప్రక్రియగా మార్చారని వెల్లడించాయి. తద్వారా విద్యార్థులకు హాస్టళ్లలో మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూరుతాయని అధికారులు తెలిపారు.