Share News

2000 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం

ABN , Publish Date - May 17 , 2026 | 06:09 AM

రాష్ట్ర ప్రభుత్వం రూ.2000కోట్ల అప్పు తీసుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఇండెంటు పెట్టింది. వచ్చే మంగళవారం ఆర్‌బీఐ.....

2000 కోట్ల అప్పు తీసుకోనున్న రాష్ట్రం

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రూ.2000కోట్ల అప్పు తీసుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఇండెంటు పెట్టింది. వచ్చే మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించనుంది. 7.54శాతం వార్షిక వడ్డీ, 2023 నాటికి అసలు సొమ్ము చెల్లించేలా రూ.750కోట్లు, 7.70 వార్షిక వడ్డీ, 2037 నాటికి సొమ్ము చెల్లించేలా రూ.500కోట్లు, 7.82 శాతం వార్షిక వడ్డీ, 2047నాటికి అసలు సొమ్ము చెల్లించేలా రూ.750కోట్ల చొప్పున అప్పుల కోసం ఇండెంట్లు పెట్టింది. మొత్తం 6రాష్ట్రాలు రూ.20,100 కోట్ల కోసం ఇండెంట్లు పెట్టాయి.

Updated Date - May 17 , 2026 | 06:09 AM