డిజిటల్ రూపంలో ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు
ABN , Publish Date - May 19 , 2026 | 04:33 AM
ప్రభుత్వ పరిపాలనా విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని సాధారణ ప్రభుత్వ ఉద్యోగులందరి సర్వీసు రిజిస్టర్లను...
మే 31 లోగా అప్‌లోడ్ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశం
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పరిపాలనా విభాగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని సాధారణ ప్రభుత్వ ఉద్యోగులందరి సర్వీసు రిజిస్టర్లను (ఎస్‌ఆర్) పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్) విధివిధానాల్లో భాగంగా, ఉద్యోగుల స్కాన్ చేసిన ఎస్‌ఆర్ కాపీలను ఐఎ్‌ఫఎంఐఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలంటూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ సోమవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. ఈ ప్రక్రియను మే 31లోగా పూర్తి చేయాలని సచివాలయ విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిని అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది.