ఉద్యోగులకు రూ.1.20 కోట్ల ఉచిత బీమా పథకం
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:52 AM
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల భరోసా కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ప్రీమియం చెల్లింపులు..
రేపే సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల భరోసా కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ప్రీమియం చెల్లింపులు, విరాళాలు లేకుండా ఏకంగా రూ.1.20 కోట్ల విలువైన ఉచిత జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకాన్ని గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్లు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగధీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.