ఉద్యోగ సంఘాల నేతలకు ఓడీ సదుపాయం
ABN , Publish Date - May 19 , 2026 | 05:12 AM
తెలంగాణలోని ప్రముఖ ఉద్యోగ సంఘాల నేతలకు అదర్ డ్యూటీ (ఓడీ) వెసులు బాటు కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ సోమవారం ...
హైదరాబాద్, మే 18 (ఆంధ్ర జ్యోతి): తెలంగాణలోని ప్రముఖ ఉద్యోగ సంఘాల నేతలకు అదర్ డ్యూటీ (ఓడీ) వెసులు బాటు కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల ప్రధాన ప్రతినిధులకు ఈ ఓడీ సౌకర్యాన్ని కల్పించింది. జీవో 685 ప్రకారం ఓడీ వసతి 2026 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. టీఎన్‌జీవో సెంట్రల్ యూనియన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, పీఆర్‌టీయూ టీఎస్, ఎస్టీయూ టీఎస్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా), తెలంగాణ క్లాస్ ఫోర్ ఉద్యోగుల కేంద్ర సంఘం, టీఎస్ యూటీఎఫ్, టీఆర్‌టీఎఫ్ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఓడీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ సచివాలయం సంఘానికి మాత్రం అధ్యక్షుడికి ఒక్కరికే ఈ సౌకర్యాన్ని కల్పించారు.