Telangana Govt: సన్నాల బోనస్.. మరో 500 కోట్లు
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:06 AM
ఖరీఫ్ సీజన్‌లో రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యంపై బోనస్ రూ.500 కోట్లు అన్నదాతల ఖాతాల్లో సోమవారం జమ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
అన్నదాతల ఖాతాల్లో జమ
ఇప్పటిదాకా 1426 కోట్ల చెల్లింపు
బోన్‌సతో క్వింటాపై రూ.2,889 గిట్టుబాటు
సివిల్‌సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యంపై బోనస్ రూ.500 కోట్లు అన్నదాతల ఖాతాల్లో సోమవారం జమ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీంతో సన్న ధాన్యం బోనస్ కింద రైతులకు ఇప్పటి వరకూ రూ.1,426 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యంపై కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ), బోనస్ కలిసి రైతుకు క్వింటాల్‌కు రూ.2,889 గిట్టుబాటయ్యిందన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాల్‌పై ఎమ్మెస్పీకి అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఇబ్బందుల్లేకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.