పన్ను లేకుండానే రెండో వాహనం..!
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:52 AM
కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించనుంది. రెండో వాహనం కొనుగోలుపై విధిస్తున్న 2శాతం అదనపు లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....
2శాతం అదనపు పన్ను రద్దుకు ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కొత్తగా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించనుంది. రెండో వాహనం కొనుగోలుపై విధిస్తున్న 2శాతం అదనపు లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధన ప్రకారం.. ఒక వ్యక్తి మీద ఇప్పటికే వాహనం ఉండి, రెండో వాహనం కొంటే అదనంగా 2శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు రూ.10లక్షల విలువైన కారు కొంటే పన్నుల రూపంలోనే రూ. 20వేల అదనపు భారం పడుతోంది. దీంతో ఈ పన్ను నుంచి తప్పించుకోవడానికి చాలా మంది తమ కుటుంబసభ్యుల పేర ్ల మీద వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. గతంలో కాలుష్య నివారణ కోసం ప్రభు త్వం చేపట్టిన చర్యల్లో భాగంగా.. రెండో వాహనంపై అదనపు పన్ను విధానాన్ని తీసుకువచ్చింది. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. పన్ను మినహాయించాలని కోరుతూ రవాణా శాఖ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పరిశీలించిన ప్రభుత్వం ఈ మేర కు నిర్ణయం తీసుకుంది. ఈ పన్ను రద్దుతో వాహన దారులపై సుమారు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక భారం తగ్గనుంది.