Share News

నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

ABN , Publish Date - May 07 , 2026 | 05:37 AM

రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. వివిధ కుల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి...

నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

  • రాష్ట్రంలోని పలు కుల కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

హైదరాబాద్‌, కేయూ క్యాంపస్‌, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ కాలనీ, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. వివిధ కుల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి బండి రమేష్‌ తెలంగాణ కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత మారబోయిన రఘునాథ్‌ యాదవ్‌.. రాష్ట్ర యాదవ సహకార సంస్థ చైర్మన్‌గా నియామకం పొందారు. వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జువ్వాది నర్సింగ్‌రావు నియమితులయ్యారు. అలాగే, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్‌గా కాకతీయ విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ నియమితులయ్యారు. వీరితోపాటు రాష్ట్రంలోని పలు కులాలు, వృత్తిపరమైన కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్‌లను నియమించింది. అదేవిధంగా ఖమ్మం స్తంబాద్రి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(సుడా) చైర్మన్‌గా పువ్వల దుర్గాప్రసాద్‌ను నియమించింది. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం జారీ చేశారు.

Updated Date - May 07 , 2026 | 05:37 AM