భక్తుల మనోభావాలను గౌరవిస్తాం
ABN , Publish Date - May 29 , 2026 | 03:39 AM
తమది భక్తుల మనోభావాలని గౌరవించే ప్రభుత్వమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా భద్రాద్రి రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి సీతక్క...
అద్భుతంగా భద్రాద్రి రామాలయాన్ని తీర్చిదిద్దుతాం: సీతక్క
భద్రాచలం, మే 28 (ఆంధ్రజ్యోతి): తమది భక్తుల మనోభావాలని గౌరవించే ప్రభుత్వమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా భద్రాద్రి రామాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం భద్రాచలం వచ్చిన ఆమె సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.586కోట్లను కేటాయించిందని, తొలివిడతగా రూ.351 కోట్లతో పనులను చేపడుతుండగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. గోదావరి తీరాన వెలసిన ఈ ఆలయం దశాబ్దాల కాలం పాటు చెక్కు చెదరకుండా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి నిధులు కేటాయించారని తెలిపారు. ఇందులో భాగంగానే మేడారంలో ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని అందంగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టగా లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారన్నారు.