గవర్నర్, సీఎం మహాశివరాత్రి శుభాకాంక్షలు
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:43 AM
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మహాశివుడి భక్తులకు ఇది అత్యంత ప్రియమైన పండగల్లో ఒకటని గవర్నర్ అన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు ఆ దేవుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులందరికి ఎల్లవేళలా శివయ్య ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. పరమేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం నిండాలని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆకాంక్షించారు.