Share News

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ ఉగాది శుభాకాంక్షలు

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:24 AM

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌భవన్‌లో ...

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌భవన్‌లో మంగళవారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన తెలుగు సంవత్సరం ప్రజల కుటుంబాల్లో ఆర్థిక, ఆరోగ్య, సంతోషాలను నిలపాలని కోరుకుంటున్నట్లు గవర్నర్‌ తెలిపారు. 60 ఏళ్ల కాలచక్రంలో పరాభవ 40వ సంవత్సరమని, పరాభవ అంటే మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను ఓడించి విజయానికి పునాది వేసేదన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 05:24 AM