Share News

లోక్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ

ABN , Publish Date - Oct 16 , 2026 | 04:47 AM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, స్త్రీ శక్తికి, సౌభాగ్యానికి బతుకమ్మ పండుగ ప్రతీకని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు.

లోక్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ
governor

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, స్త్రీ శక్తికి, సౌభాగ్యానికి బతుకమ్మ పండుగ ప్రతీకని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తన సతీమణి జానకీ శుక్లాతో కలిసి గవర్నర్‌ పాల్గొన్నారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని ప్రార్థించారు.

Updated Date - Oct 16 , 2026 | 04:47 AM