ఇంధన వాడకాన్ని తగ్గిద్దాం
ABN , Publish Date - May 15 , 2026 | 04:42 AM
ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా కదిలి రావాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్....
ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు
గవర్నర్ కాన్వాయ్‌లో 50 శాతానికి వాహనాల కుదింపు
ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, విదేశీ మారక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా కదిలి రావాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఈ మేరకు గవర్నర్ వీడియో సందేశాన్ని లోక్‌భవన్ గురువారం విడుదల చేసింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు తన కాన్వాయ్‌లోని వాహనాలను 50శాతానికి తగ్గించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కాగా, మాదక ద్రవ్యాల నిర్మూలనపై గవర్నర్ ప్రత్యేకంగా మాట్లాడారు. నషా ముక్త్ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల అడ్మిషన్ ఫామ్‌ల్లోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామనే ప్రతిజ్ఞను చేర్చాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లో తాను చేపట్టిన ఉద్యమం మీడియా సహకారంతోనే విజయవంతమైందని, తెలంగాణ మీడియా సైతం ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.